23-09-2025 12:00:00 AM
వెంకటాపురం(నూగూరు), సెప్టెంబర్ 22( విజయక్రాంతి): అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ వివాదంగా ముదిరి హత్యకు కారణమైనది. మండల పరిధిలోని బర్లగూడెం పంచాయతీ చిరుతపల్లి గ్రామానికి చెందిన గొంది మాధవరావు(35) తన సోదరులతో గొడవపడ్డాడు.
గొడవ ముదిరి వివాదం పెద్దది కావడంతో మాధవరావు తలపై అతని సోదరుడు బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించడంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.