23-12-2025 12:00:00 AM
ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు
ఘనంగా సత్కరించిన నాయకులు, గ్రామ పెద్దలు
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేస్తామన్న నూతన పాలకమండలి
గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం
మెదక్/పాపన్నపేట, డిసెంబర్ 22(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో గ్రామ పంచా యతీ నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. ఇన్నాళ్లు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు ఇక విముక్తి కలిగింది. ఆయా గ్రామ పంచాయతీలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మండల ప్రత్యేక అధికారులు, ఎం పీడీవోలు, గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేసారు. ముందుగా నాయకులు, గ్రామస్తులతో కలి సి గ్రామ పంచాయితీ కార్యాలయానికి ర్యా లీగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం శాలువాలతో సత్కరించుకున్నారు. సుమారు రెండు సంవత్స రాల తర్వాత పల్లెలకు ప్రత్యేక అధికారుల పాలనతో విముక్తి లభించింది.
గత సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచులు, వా ర్డు సభ్యుల పదవీకాలం ముగిసింది. దీంతో ఎన్నికలు జరిగే వరకు పంచాయతీల్లో ప్రత్యే క అధికారుల పాలనను ప్రవేశపెట్టింది. జి ల్లాలో మూడు విడుతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కొంగొత్త పాలనకు పంచాయతీలు ముస్తాబయ్యాయి. కొత్త పంచాయతీలు కొలువుదీరిన అనంతరం మండల ప్రత్యేక అధికారులు, ఎంపీ డీవోల ఆధ్వర్యంలో మొదటి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరవేసేలా చూస్తామని హామీ ఇచ్చా రు. గ్రామాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళ్లేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నాడు ఎంపీపీగా..
నేడు సర్పంచ్ గా ప్రమాణం..
తెరాస ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2019 వరకు నాడు పాపన్నపేట ఎంపీపీ గా.. నేడు బాచారం గ్రామ సర్పంచ్గా ఆమె ఎన్నికైంది. మండల పరిధిలోని బాచా రం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా సొంగ పవిత్ర దుర్గయ్య డిసెంబర్ 11న గురువారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారాస మద్దతుతో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పావని గణేష్ పై 22 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బాచారం గ్రామ అభివృద్ధికీ కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం
రోజే కుర్చీల కొట్లాట
సిద్దిపేట, డిసెంబర్ 22 (విజయక్రాంతి): పాలకవర్గం లేక గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గ్రామ పంచా యతీ ఎన్నికలు ముగిశాయి. మూడు విడతలుగా జరిగిన సర్పంచ్ వాటి సభ్యుల ఎన్నిక లు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నన్ని రోజులు పోలీ సు అధికారులు శాంతిభద్రతపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
సోమవా రం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 508 మంది సర్పంచులు, 4508 మంది వార్డు సభ్యులు ప్రమాణం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాలుగా సాగిన ప్రత్యే క అధికారుల పాలనకు ముగింపు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో జరగచూపితే కొంటుబడిన అభివృద్ధి మెరుగు దిద్దుకుని అవకాశం ఉంటుందని సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు అప్పగించినట్లే నిధులు విడుదల చేయాలని నూతన సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు.
జగదేవపూర్ లో రసభాస..
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారంలోనే కుర్చీ ల కొట్లాట జరిగింది. నువ్వెంత అంటే ను వ్వెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చే స్తుండగాని సభ్యులందరూ వేదిక పైకి వెళ్లారు. బిఆర్‌ఎస్ నాయకులు, సర్పంచ్ పానగట్ల శ్రీనివాస్ గౌడ్, 8 మంది బిఆర్‌ఎస్ వార్డు సభ్యులు వేదికపై కూర్చున్నారు. 5 మంది కాంగ్రెస్ సభ్యులు వచ్చేసరికి సరిపడా కూర్చిలు లేకపోవడంతో అధికార పా ర్టీ వార్డు సభ్యులమైన మాకు కుర్చీలు ఏర్పా టు చేయరా అంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
కా నీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తుండగానే వార్డు సభ్యులు తొందరపడుతున్నారంటూ అక్కడున్న ప్రజలందరూ చర్చించుకోవడం కనబ డింది. సభ్యులు ఒకరిపైకి ఒకరు కుర్చీలు లేవనెత్తి కొట్టుకునేంత స్థాయికి వెళ్ళింది. అప్రమత్తమైన ఎస్త్స్ర కృష్ణారెడ్డి తన సిబ్బందితో ఇర్వర్గాలని సముదాయించారు. అనం తరం ప్రమాణ స్వీకారం సజావుగా సాగింది.
ప్రమాణస్వీకారంలో రచ్చ..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ సర్పంచ్ , వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘర్షణలకు దారితీశాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రం లో బిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ , వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాల అనంతరం బిఆర్‌ఎస్ మద్దతు దారులు అభివృద్ధి ప నుల విషయంలో ప్రసంగిస్తుండగా, కాంగ్రె స్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకుల మధ్య మా టలు పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. నాయకుల తోపులాటతో ఉద్రిక్తత పరిస్తితి ఏర్పడటంతో పోలీసులు లాఠి ఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
నంగునూరులో...
మండల వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలంలోని మొత్తం 25 గ్రామ పంచాయతీల్లో ఆ యా గ్రామాల ప్రత్యేక అధికారుల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక అధికారులు నూతన సర్పంచులతో ప్రమాణ స్వీకారం చేయించా రు. అనంతరం వారు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
చేగుంట మండలంలో నూతన సర్పంచ్ల బాధ్యతలు
చేగుంట, డిసెంబర్ 22 :చేగుంట మండలంలోని 25 గ్రామ పంచాయతీలలో నూత నంగా ఎంపికైన సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులచే స్పెషల్ ఆఫీసర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భం గా సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యు లు మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రా మాలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. నూతన పాలకవర్గాలను పలువురు అభినందిస్తూ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రమాణ స్వీకారంలో పాల్గొనని
వార్డు సభ్యులు
పాపన్నపేట, డిసెంబర్ 22 :నాగ్సాన్ పల్లి గ్రామ పంచాయతీ భవనానికి రాజకీయ పా ర్టీ పోలిక ఉండే రంగులు వేశారని, వెంటనే ఆ రంగులు మార్చాలని భారాస మద్దతుతో గెలుపొందిన వార్డు సభ్యులు, భారాస నాయకులు ఆరోపించారు. ఇదే విషయమై సోమవారం ఎంపీఓ శ్రీశైలంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యు లు, భారాస నాయకులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ భవనానికి రాజకీయ పార్టీ పోలిక ఉండే రంగులు వేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాము సోమ వారం పాలకవర్గ ప్రమాణ స్వీకారం సైతం చేయలేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే రంగులు మార్చాలని డిమాండ్ చేశారు. వార్డు సభ్యులు నాగమణి, శ్రీనివాస్, రాజ్ కుమార్, శ్రేయ, భా రాస గ్రామ కమిటీ అధ్యక్షుడు శేకులు, నా యకులు శ్రీనివాస్, తదితరులున్నారు.
బీఆర్‌ఎస్ సర్పంచ్, ఉప సర్పంచులను సన్మానించిన ఎమ్మెల్యే
వెల్దుర్తి, డిసెంబర్ 22 : వెల్దుర్తి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన 11 గ్రామ పంచాయతీ నూతన సర్పంచులకు ఉప సర్పంచ్, వార్డు సభ్యులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీ త లక్ష్మారెడ్డి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతీ గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన, సమగ్ర గ్రామా భివృద్ధి దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొలువుదీరిన గ్రామ పంచాయతీలు
జహీరాబాద్, డిసెంబర్ 22 :గ్రామ పం చాయతీలో ఎన్నికలు సజావుగా జరిగి నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్ర మాణ స్వీకార ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గం లోని మొగుడంపల్లి, కోహ్లీ, జహీరాబాద్, న్యాల్కల్ ఝరాసంగం మండలాలలో ప్ర మాణ స్వీకార ఉత్సవాలు సోమవారం నా డు ఘనంగా నిర్వహించారు. ప్రమాణ స్వీ కార ప్రమాణ స్వీకారం తర్వాత ఆయా పార్టీ లు బలపరిచిన అభ్యర్థులు సర్పంచులు గా గెలుపొందిన గ్రామాలలో విందులు ఏర్పా టు చేశారు.
భాజా భజంత్రీలతో టపాసులు కాల్చుతూ ఊరేగింపులు నిర్వహించారు. కోహిర్ మండలంలోని దిగ్వాల్ అతిపెద్ద గ్రా మపంచాయతీ కాగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జరా సంఘం మండలం శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు స్వగ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. కాగా కొలువుదీరిన పాలకమండలి ఏ విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తారోనని ఎదురుచూస్తున్నారు.
101 సర్పంచులు,
874 వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
తూప్రాన్, డిసెంబర్ 22 :తూప్రాన్ డివిజన్ పరిధిలో మొత్తం 101 సర్పంచులు, 101 ఉప సర్పంచులు, 874 వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం సోమవారం పూర్తి చేయడం జరిగిందని ఆర్డీవో జయచంద్ర రెడ్డి తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా కృషి చేశామన్నారు. ఒక కొనాయిపల్లి పీటీ పరిధిలో చిన్న సంఘటన తప్ప, ఎక్కడా శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీస్ శాఖ సమర్థవంతంగా వ్యవహరించిందని ప్రశంసించారు.
గుండ్రెడ్డీపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రెటరీ దోమలపల్లి యాదమ్మ చేత నూతన సర్పంచిగా ప్రమాణం చేయించారు. ఉప సర్పంచ్ గా మన్నే చంద్రకళ ప్రమాణం చేశారు. వీరితోపాటు గ్రామంలోని వివిధ వార్డుల సభ్యులు ప్రమాణం చేయడం జరిగింది. ఇందులో తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. అలాగే కిష్టాపూర్ సర్పంచ్ గా చుక్క హిమబిందు శ్రీశైలం, ఉప సర్పంచ్ గా బామని రవీందర్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
నాడు ఉపసర్పంచ్ గా నేడు సర్పంచుగా..
తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామ నూతన సర్పంచిగా హరీష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు ఉప సర్పంచ్, నిర్ణీత వార్డు సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హరీష్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఉపసర్పంచిగా పనిచేయడం జరిగిందని మరోసారి గ్రామస్తులు సర్పంచ్ గా నన్ను ఆశీర్వదించారని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.