calender_icon.png 23 December, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ బలోపేతం

23-12-2025 12:00:00 AM

ఎల్బీనగర్, డిసెంబర్ 22: ఆర్టీసీ అభివృద్ధికి ఉద్యోగోలు, సిబ్బంది కృషి చేయాలని, మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బలోపేతం అవుతుందని హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు. సోమవారం  హయత్‌నగర్ 1 డిపోను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా డిపోలో ఉద్యోగులతో మాట్లాడి, ఉద్యోగుల భోజన గదులు, విశ్రాం తి గదులను తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకాన్ని కొంతమంది ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తూ సంస్థ చెడ్డ పేరు తెస్తున్నారని, ఇకపై అలాంటివి జరుగకుండా చూడాలని కోరారు.

వచ్చే నెలలో జరిగే మేడారం జాతర కు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. అనంతరం సందర్బంగా డిపోలో మొక్కను నాటారు. కార్యక్రమంలో గ్రేటర్ రీజినల్ సహాయ మేనేజర్ శ్రీనివాస్ రావు, డిపో మేనేజర్ విజయ్, సహాయ మేనేజర్లు సరస్వతి, సత్తయ్య, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు