17 April, 2026 | 7:28 PM

ఘనంగా గణిత దినోత్సవం

23-12-2025 12:06 AM

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కృష్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ,  ఖమ్మంలోని శ్రీనివాస నగర్‌లో ఉన్న గీతాంజలి విద్యానికేతన్‌లో సోమవారం ఘనంగా గణితదినోత్సవం ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, టీ పద్మ, టీ అరుణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, హైస్కూల్ విద్యార్థులు వివిధ గణిత సూత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.