23-12-2025 12:05:36 AM
స్టెమ్ స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): శ్రీనగర్ కాలనీలోని స్టెమ్ స్పార్క్ రెజొనెన్స్ స్కూల్‌లో ప్రపంచ గణిత మేధా వి, గణిత మార్గదర్శి శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత ది నోత్సవం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించా రు. ఈ సంధర్భంగా స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు శ్రీనివాస రామానుజన్ గొప్పతనాన్ని, వారి పరిశోధనలను వివరించారు.
పేద కుటుంబంలో జన్మించి గణితంలో ఎన్నో పరిశోధ నలు చేసి 32 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచ గణిత మేధావిగా ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగారని చెప్పారు. స్కూల్ ఆవరణంలో విద్యార్ధులు గణిత ప్రాజెక్టులు, మోడ ల్స్, చార్ట్ ్స, ఫజిల్స్ ప్రదర్శనకు పెట్టడం జరిగినది. గణిత క్విజ్, ఫజిల్స్ వంటి పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు. కార్యక్రమంలో డైరెక్టర్ కొండా కృష్ణవేణి, ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బం ది పాల్గొన్నారు.