calender_icon.png 23 December, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ డబ్బు.. మీ హక్కును సద్వినియోగం చేసుకోవాలి

23-12-2025 01:48:48 AM

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

ఐడీఓసీలో మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమం

హాజరైన వివిధ బ్యాంకుల, ఎల్‌ఐసీ ప్రతినిధులు

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 22(విజయ క్రాంతి): మీ డబ్బు.. మీ హక్కు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పిలుపు ఇచ్చారు.క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం మీ డబ్బు.. మీ హక్కు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు, మీ హక్కు అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.

బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని చేపట్టారని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, సమీప ప్రజలకు తెలియజేయాలని సూచించారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు.. బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ వివరాలు అందించి డబ్బులు పొందాలని పిలుపు ఇచ్చారు.

కచ్చితంగా నామినీ వివరాలను ఆర్థికపరమైన లావాదేవీల్లో పెట్టాలని, అడ్రస్ మారితే బ్యాంక్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గమ్ వ్బుసైట్ (https://udgam.rbi.org.in) ద్వారా పొందొచ్చని తెలిపారు.కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్ సాయి, యూబీఐ లీడ్ బ్యాంక్ ఏజీఎం రాధాకృష్ణ, ఎస్బీఐ ఏజీఎం వెంకటేష్, ఎల్‌ఐ సీ ఏఏఓ వరలక్ష్మి, ప్రోగ్రామ్ కన్వీనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.