calender_icon.png 23 December, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ సర్కార్‌లో విద్యకు ప్రాముఖ్యత

23-12-2025 01:50:14 AM

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు 

సుల్తానాబాద్, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థుల కోసం దాదాపు 45 రోజుల పాటు తన సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం వ్యయ ప్రయాసలకు గురికాకుండా ఇబ్బందులు పడి సమయం వృధా కాకుండా ఉండటం కోసం తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.