02-05-2025 12:00:00 AM
మహబూబాబాద్, మే1 (విజయ క్రాంతి): ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే వేడుకలను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ఎరుపు రంగు దుస్తులు, ఎర్రజెండాలతో శోభాయాత్ర నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం పూర్తిగా ఆయా కార్మిక సంఘాల ర్యాలీలతో అరుణ వర్ణంగా మారింది.
సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐసిటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే డే వేడుకలను పండగగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ఆయా కార్మిక సంఘాల నేతలు అరుణ పతాకాలను ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం అమరులైన నేతలను గుర్తు చేసుకున్నారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సైతం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
వడ్డెపల్లిలో మే డే వేడుకలు..
హనుమకొండ, మే 1 (విజయ క్రాంతి): హనుమకొండ వడ్డెపల్లిలోని చెరువు కట్ట మాత్స పరిశ్రమిక శాఖ సంఘం పెద్దల ఆధర్యంలో అధ్యక్షులు మట్టిపల్లి నర్సింగం మే డే జెండాను ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఫిషర్ మెన్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ మండల సమ్మయ్య హజరు అయ్యారు.
ఈ సందర్భంగా మండల సమ్మయ్య ని శాలువతో సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ డైరెక్టరులు ముట్టెపల్లి శంకర్, ఉపాద్యక్షుడు కోటి, నటరాజ్, పాల సారయ్య, మట్టిపల్లి సదానందం, క్రాంతి కూమార్, రవి, ఎం. బాబు, మట్టిపల్లి, రమెష్ తదితరులు పాల్గొన్నారు.
మే డే సందర్భంగా అన్నదానం
మహబూబాబాద్: మే డే సందర్భంగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ సీతామాలక్ష్మి దంపతుల తనయుడు సూర్యచంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని కేసముద్రం పట్టణంలో కార్మికులకు బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
మార్కెట్ మాజీ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్, మాజీ ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మాజీ జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మండల బి.ఆర్.ఎస్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, కమటం శ్రీనివాస్, జాటోత్ హరీష్ నాయక్, గుగులోత్ వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.