calender_icon.png 5 May, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోశాల యజమానిపై కేసు నమోదు

02-05-2025 12:00:00 AM

ఉట్నూర్, మే 1 (విజయక్రాంతి): కోర్టు ఆధీనంలో,  కేసులో ఉన్న ఎడ్లను జాగ్రత్త గా కాపాడాలని గోశాల యజమానులకు ఉట్నూర్ ఏఎస్పీ కాజర్ సింగ్ సూచించారు. ఓ కేసులో ఉన్న 15 ఎడ్లను కామధేను గోశాలకు పంపగా, గోశా ల యజమాని ఆర్యన్, నిర్వాహకుడు రాజు అందులోని 11 ఎడ్లను ఇత రులకు అనధికారికంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై గుడిహత్నూర్ పోలీస్‌స్టేషన్‌లో సుమోటోగా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

A1గా ఆర్యన్,  A2 గా రాజు పై క్రైమ్ నెంబర్ 80/25 తో అండర్ సెక్షన్ 316(3), 314 బిఎన్‌ఎస్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపా రు. గోశాల యజమా నుల కు పలు సూచనలు చేస్తూ కోర్టు ద్వారా కానీ, కేసు నమోదు ద్వారా గోశాలలో తాత్కాలికంగా ఉంచిన ఎడ్ల ను అమ్మడం గానీ, ఇతర రైతులకు కిరాయికి గాని ఇవ్వడం చేయరాదని, వాటిని దుర్వినియోగం చేయారదని సూచించారు. దుర్విని యోగం చేసిన, ఇతర చట్ట వ్యతిరేక పనులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.