calender_icon.png 7 May, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత బ్యానర్‌లో 40వ చిత్రానికి శ్రీకారం

05-05-2025 12:00:00 AM

తనదైన నటనా ప్రతిభతో దక్షిణాదిన తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకు న్నారు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు తన కెరీర్‌లో మైలురాయిగా నిలువనున్న చిత్రానికి శ్రీకారం చుట్టారాయన. ఆయన హీరోగా, నహాస్ హిదాయత్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ‘ఐ యామ్ గేమ్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను దుల్కర్ తన సొంత ప్రొడక్షన్ వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం.

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన పూజా కార్యక్రమానికి ప్రముఖ నటుడు యాంటోని వర్గీస్, తమిళ దర్శక నటుడు మిస్కిన్, ఇతర ప్రధాన తారాగణం హాజరయ్యారు. మిస్కిన్ ఈ సినిమాతో మలయాళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. దుల్కర్‌కు ఇది 40వ చిత్రం కావటం విశేషం. అంతేకాదు ఆయన ఇప్పటివరకూ చేసిన మలయాళ చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.

తిరువనంతపురంలో మొదటి షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతుంది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. సజీర్ బాబా, ఇస్మాయిల్ అబుబక్కర్, బిలాల్ మొయిదు ఈ చిత్రానికి కథను అందించగా, ఆదర్శ్ సుకుమారన్, షహబాస్ రషీద్ డైలాగ్ రైటర్స్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీగా జిమ్షీ ఖలీద్, ఎడిటర్‌గా చమన్ చాకో పనిచేస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.