calender_icon.png 21 September, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద బిడ్డకు ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు

20-09-2025 11:24:20 PM

మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన దుద్దుకూరి శంకరమ్మ రాములు దంపతుల కుమార్తె పల్లవికి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు లభించింది. గతంలో పెద్దకుమారుడు మహేష్రాయ్ పూర్ ఏయిమ్స్ లో  ఎంబిబిఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నకుమారుడు సురేష్ కుమార్ ఐఏఎస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పట్టుదలతో పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దుతున్న దుద్దుకూరి శంకరమ్మ రాములును పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.