20-09-2025 11:27:36 PM
మనోహర్ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ: కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన కుక్కడప్పు నాగేశ్వరరావు కుమారుడు మనోహర్ గత నెల రోజుల క్రితం వరద కాలవలో పడి చనిపోవడం అత్యంత బాధాకరమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. భవిష్యత్తు ఉన్న విద్యార్థి అతి చిన్న వయసులో మృతి చెందారని వారి కుటుంబానికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన ఐదు లక్ష రూపాయలను చెక్కును మృతి చెందిన విద్యార్థి తండ్రి నాగేశ్వరావుకు అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి నాగేశ్వరావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.