calender_icon.png 14 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.10కే రైతులకు భోజన వసతి

14-11-2025 01:02:55 AM

  1. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డ్‌లో ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే 

రైతుల సౌకర్యార్థం ఇస్కాన్ వారి సహకారంతో ఏర్పాటు

ఆదిలాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): పంటను అమ్ముకునేందుకు మార్కె ట్ యార్డ్ కు వచ్చే రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డులో భోజన వసతి కల్పించ డం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో ఇస్కాస్ ట్రస్ట్ సహకారముతో రైతులకు 10 రూపాయల మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఇస్కాన్ సంస్థ ప్రభు జీ ప్రణవనందతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం రైతులకు భోజనాన్ని వడ్డించి, వారితో కలిసి అతిథులు సైతం భోజనం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  రైతుల సౌకర్యార్థం ఇస్కాన్ వారి సహకారంతో కేవలం 10 రూపాయలకు మధ్యాహ్న భోజనం ఏర్పా టు చేయడం జరిగిందని అన్నారు. బయట మార్కెట్‌లో ఎక్కువ ధర ఉన్నందున తక్కువ ధరతో నాణ్యత, హైజీన్ గా ఇక్కడ భోజనం అందించడం జరుగుతుందన్నారు. అమ్మకాల కొరకు మార్కెట్ కు వచ్చిన రైతులకు, వారి వాహనాల డ్రైవర్‌లకు ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. 

ఒక్క పూట భోజనానికి 35 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు అంచనా వేసి, 15 రూ. మార్కెటింగ్ శాఖ కాంట్రిబ్యూషన్ తో, 10 రూ. ఇస్కాన్ ట్రస్ట్ కాంట్రిబ్యూషన్ తో, 10 రూ. రైతుల కాంట్రిబ్యూషన్ తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ...

ఇస్కాన్ ట్రస్ట్ సహకారంతో మార్కెట్లో మధ్యాహ్న భోజనం కార్యక్రమం ప్రారంభించడం శుభపరిణామనని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకపూట భోజనం పెట్టే అవకాశం దొరికిందన్నారు. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, ఇతర అధికారులు, ఇస్కాన్ ట్రస్ట్ ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.