calender_icon.png 10 September, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి

08-09-2025 12:00:00 AM

ఆకస్మిక తనిఖీల సందర్భంగా ఉద్యోగులను హెచ్చరించిన ఐటీడీఏ పీఓ రాహుల్ 

భద్రాచలం 07 (విజయ క్రాంతి) బీఈడీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలకు స మయానుకూలంగా మెనూ ప్రకారం ప్రతిరో జు పౌష్టికరమైన ఆహారం అందించి వారి విద్యకు భంగం కలగకుండా అన్ని రకాల సౌ కర్యాలు కల్పిస్తామని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బిఈడి కళాశాల విద్యా ర్థినిలకు తెలిపారు.ఆదివారం భద్రాచలం ప ట్టణంలోని బీఈడీ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినిలకు తయారు చేస్తున్న వంటకాలను,

చికెన్, కూరగాయలు వండిన ఆహారాన్ని పరిశీలించారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థినిలకు భోజనం అందిస్తున్నది లేనిది, కళాశాలలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థి నులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆ యన మాట్లాడుతూ వర్షాకాలం నడుస్తున్నందున విద్యార్థినిలకు వండిన ఆహారం వే డిగా ఉన్నప్పుడే వడ్డించాలని, విద్యార్థినిలకు వండిన భోజనం సరిగా లేకపోవడంతో,

మె నూ ప్రకారం ఈరోజు తప్పనిసరిగా చికెన్ ఉండవలసి ఉండగా చికెన్ సరఫరా లేటుగ అవడంతో చికెన్ సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ను మందలించి, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న అన్ని ఇన్స్టిట్యూషన్లలో సమయానుకూలంగా నాణ్యత గా ఉండే చికెన్ సరఫరా చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్లు చికెన్ సరఫరా నాణ్యతగా ఉన్నది లేనిది ఏటిడిఓ మానిటరింగ్ చేయాలని, అలాగే వంట చేసే సిబ్బంది వంట విషయంలో అశ్రద్ధ చేస్తున్నట్లు తన దృష్టికి వ చ్చినందున వెంటనే సిబ్బందిని మార్చివేసి, కొత్తవారిని నియమించాలని ఏ టి డి ఓ కి సూచించారు.

వర్షాకాలంలో డార్మెటరీ, డై నింగ్ హాల్ మరియు తరగతి గదులు, టా యిలెట్స్, బాత్రూమ్స్ ఉరుస్తున్నాయని విద్యార్థినిలు పిఓ దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత తొందరగా మరమ్మతులు చేయిం చాలని ఏఈ ట్రైబల్ వెల్ఫేర్ కు ఆదేశించా రు. విద్యార్థినిలు మీ యొక్క విద్యకు భంగం కలగకుండా చదువుకోవాలని మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా కల్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏ టి డి వో అశోక్ కుమార్, టి ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.