16-08-2025 07:25:00 PM
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి..
కొండపాక: మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను శనివారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి(District Collector Hymavathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మేను ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా, పరిశుభ్రమైన కూరగాయలను వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. వంట గదిలోకి వెళ్లి వంట సామాగ్రిని, వండిన కూరగాయలను టేస్ట్ చూశారు. వంటగదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని వారికి సూచించారు.