calender_icon.png 9 January, 2026 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగుమారిన సోయాను కొనుగోలు చేయాలి

07-01-2026 12:12:37 AM

అసెంబ్లీలో ఎమ్మెల్యే పాయల్ 

ఆదిలాబాద్, జనవరి 6 (విజయ క్రాంతి): రంగు మారిన సోయాబీన్ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా సోయాబీన్ రైతుల పడుతున్న ఇబ్బందులను మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావించారు. అదిలాబాద్ జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధా రపడిన జిల్లా అని, పత్తి, సోయాబీన్ ముఖ్య పంటగా రైతులకు ఆదాయ వనరుగా ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో తెలిపారు.

అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా సోయాబీన్ పంటలో రంగు మా రిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం రంగు మారిన సోయాబీన్ కొనుగోలుకు నాణ్యత లేదని కొనుగోలు చేపట్టడం లేదన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మిగిలిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి, రంగు మారిన సోయాబీన్ను కూడా కొనుగోలు చేస్తేనే జిల్లా రైతులకు న్యాయం జరిగి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.