calender_icon.png 2 December, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన నీటి సరఫరాకు చర్యలు..

12-02-2025 06:11:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రతిరోజు ప్రజలకు తాగునీరు అందించే మిషన్ భగీరథ నీటి నాణ్యత విషయంలో తగు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. వారం రోజులుగా నిర్మల్ మున్సిపాలిటీకి తాగునీరు అందించే మిషన్ భగీరథ పైప్ లైన్ నుండి ఆకుపచ్చనీరు నీటిలో మలినాలు ఉన్నాయని ప్రజలు ఫిర్యాదులు చేయడంతో మిషన్ భగీరథ అధికారులకు తెలిపి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నీటి నాణ్యతను పరిశీలించడం జరిగిందని ప్రజలు నీటిపై అసత్య ప్రచారం చేయవద్దని సూచించారు.