02-12-2025 02:00:47 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. సోమవారం పట్టణ పరిధిలోని నెహ్రూ సెంటర్ నుండి పత్తిపాక వరకు నూతనంగా ఏర్పాటు చేసిన వీధిలైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 59 కోట్ల 62 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. బంధం చెరువును మరో ట్యాంక్ బండ్ గా మారుస్తానని హామీ ఇచ్చారు.