calender_icon.png 2 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బచ్చన్నపేట గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి

02-12-2025 01:59:43 AM

బచ్చన్నపేట సర్పంచ్ అభ్యర్థి  పైసా రాజశేఖర్

బచ్చన్నపేట,డిసెంబర్ 1 (విజయక్రాంతి): బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పైసా రాజా శేఖర్  సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీగా  వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే గ్రామంలో పుట్టి పెరిగానని, గ్రామ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నానని, గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని  గ్రామాభివృద్ధికి కృషి తోడ్పడతానని గ్రామంలో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ఇసారి ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే బచ్చన్నపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని పైసా రాజశేఖర్ గ్రామస్తులను కోరారు.