calender_icon.png 2 December, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే మెయింటెనెన్స్ డిపోను మానుకోటలోనే ఏర్పాటు చేయాలి

02-12-2025 02:02:12 AM

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించిన రైల్వే మెగా మెయింటినెన్స్ డిపోను మహబూబాబాద్ జిల్లా పరిధిలోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీపిజేఎసీ ప్రతినిధులు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించిన మెగా మెయింటెనెన్స్ డిపోను వరంగల్ వైపు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోందని, ఈ విషయంపై మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్యా మురళి నాయక్, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య తదితరులు స్పందించి ఈ ప్రాంతంలోనే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ మేరకు ప్రజాప్రతినిధులందరికీ వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు సత్యనారాయణ, శ్రీనివాసులు, జానీ, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.