calender_icon.png 22 December, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదాలు జరగకుండా చర్యలు

22-12-2025 12:14:06 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ గ్రామం నుంచి లొంకలపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముండ్ల పొదలను, చెట్లను తొలగించినట్టు ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్త్స్ర మాట్లాడుతూ...గోపాల్పేట్ గ్రామం నుంచి లొంకలపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా ముండ్ల పొదలు,చెట్లు ఎక్కువగా ఉండడంతో ఎదురుగా వచ్చే ఇతర వాహనాలు స్పష్టంగా కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఉద్దేశంతో పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తొలగించడం జరిగిందన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను పొదలను తొలగించి ప్రమాదాలు జరిగే ప్రాంతమని సూచించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు.