22-12-2025 12:11:59 AM
బోయినపల్లి : డిసెంబర్21( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామ ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటానని సర్పంచ్ చల్లా శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరద వెల్లి సర్పంచ్ గా నేడు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజల అధి కారుల సమక్షంలో నూతన సర్పంచిగా బా ధ్యతలు తీసుకొనున్న సందర్భంగా అయన మాట్లాడుతూ ఎంతో నమ్మకం తో ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది.
అటువంటి ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండ నిరంతరం గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తాను. గ్రామంలో మిగిలి పోయిన సమష్యల పరిష్కారం కు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అదేవిధంగా కృషి చేస్తాను. ముఖ్యంగా వరద వెళ్లి ముంపు గ్రామం కావడంతో కొందరు ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది వారందరికీ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టికి సాధిస్తాను.అధికారుల ప్రజల సంపూర్ణ సహకారం తో గ్రామాన్ని అభివృద్ధి పథం లో తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను.