20-10-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
మెదక్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మెదక్ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మెదక్ మండలం మంబోజిపల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ పాలనలో మెదక్ అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా మెదక్ నియోజకవర్గం అభివృద్ధి లో వేగంగా దూసుకుపోతుందన్నారు. మెదక్ మరింత అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు.
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ మెదక్ అభివృద్ధి పై ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గానికి అనేక నిధులు తెచ్చారని, ఇంకా నిధులు తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉప్పల రాజేష్, వెంకట రమణ, బొజ్జ పవన్, శ్రీనివాస్ చౌదరి మాజీ కౌన్సిలర్లు లక్ష్మినారాయణ గౌడ్, లింగం, వసంత్ కుమార్, హనుమాన్ స్టిల్ ఇండస్ట్రీస్ నిర్వాహకులు అఖిల్ రెడ్డి, అరవింద్ గౌడ్, సృజన్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.