calender_icon.png 16 October, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరీస్ క్లీన్ స్వీప్

16-10-2025 12:00:00 AM

రెండో టెస్టులో భారత్ ఘనవిజయం కెప్టెన్‌గా గిల్‌కు తొలి సిరీస్ విక్టరీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2 క్లీన్ స్వీప్ చేసింది. న్యూఢిల్లీ అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌గా శుభమన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం. అలాగే రెండో సిరీస్‌లోనే సారథిగా క్లీన్‌స్వీప్ విజయాన్ని సొంతం చేసుకున్న కెప్టెన్‌గానూ నిలిచాడు. 1 వికెట్ నష్టానికి 63 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ తొలి సెషన్ సగంలోనే మ్యాచ్‌ను ముగించింది. సాయిసుదర్శన్(39), గిల్(13) వికె ట్లు కోల్పోయినప్పటకీ... కేఎల్ రాహుల్ (58) హాఫ్ సెంచరీతో రాణించాడు. జురెల్‌తో కలిసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో 3 వికె ట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

నిజానికి ఈ మ్యాచ్ ఐదోరోజు వరకూ వచ్చిందంటే కారణంగా వెస్టిండీస్ పోరాటమే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 పరుగుల భారీస్కోరుకు డిక్లేర్ చేయగా... వెస్టిండీస్ మాత్రం 248 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో విండీస్‌కు భారత్ ఫాలో ఆన్ ఇవ్వడం... ఆ జట్టు త్వరగానే 2 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ మూడురోజుల్లోపే ముగిసేలా కనిపించింది. అయితే ఓపెనర్ కాంప్‌బెల్(115), హోప్ (103) అసాధారణ పోరాటంతో ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కింది. చివర్లో గీవ్స్, సీల్స్ కూడా రాణించడంతో 121 రన్స్ టార్గెట్‌ను భారత్ ముందుంచింది. భారత్ సునాయాసంగానే ఈ టార్గెట్‌ను ఛేదించినా మ్యాచ్ చివరిరోజు వరకూ వెళ్ళింది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన కుల్దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవా ర్డు లభించగా.... సిరీస్‌లో బంతితో పాటు బ్యాటుతోనూ సత్తా చాటిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

ఇదిలా ఉంటే ఈ విజయంతో భారత్ పలు రికార్డులను సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజ యం. దీంతో వరుసగా ఒకే జట్టుపై ఎక్కువ సిరీస్‌లు గెలిచిన సౌతాఫ్రి కా రికార్డును టీమిండియా సమం చేసింది. అలాగే ఒకే వేదికపై ఓటమి లేని రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. 1993 నుంచి ఢిల్లీలో 14 టెస్టులు ఆడిన భారత్ 12 గెలిచి, రెండింటిని డ్రా చేసుకుంది. ఇదిలా ఉంటే సొంతగడ్డపై అత్యధిక (122) టెస్ట్ విజయాలు సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో ఆస్ట్రేలియా (262), ఇంగ్లాం డ్ (241) తర్వాత భారత్ కొనసాగుతోంది.

స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ : 518/5 డిక్లేర్డ్

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్  : 248 ఆలౌట్

వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్  : 390 ఆలౌట్

భారత్ రెండో ఇన్నింగ్స్  : 124/3

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్  : కుల్దీప్ యాదవ్

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్  : రవీంద్ర జడేజా