25-06-2025 08:10:32 PM
కోటిన్నర వరకు మెడిసిన్ నష్టం..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్గొండ జిల్లా(Nalgonda District) కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల సాయిరాం మెడికల్ ఏజెన్సీ(Sairam Medical Agency) బుధవారం షాట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మెడిసిన్, సర్జికల్ ఎక్విప్మెంట్ లు పూర్తిగా కాలిపోయి కోట్ల రూపాయల నష్టం వాటిలినట్లు ఏజెన్సీ యాజమానులు మూడు దుడ్ల వినోద్, గంజి అశోక్, భువనేశ్వరిలు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మెడికల్ ఏజెన్సీ ఫస్ట్ ఫ్లోర్లో పొగలతో కూడిన మంటలు రావడంతో సమీపంలో ఉన్నవారు ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయడంతో రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి చాలాసేపు కష్టపడి మంటలను ఆర్పారు.
భవనం కాలిపోతున్నప్పుడు అందులోనున్న మెడిసిన్ సర్జికల్ ఐటమ్స్ కాలిపోతూ బాణాసంచా పేల్చిన శబ్దాలు రావడంతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా కృషి చేశారు. సుమారు కోటిన్నర నష్టం రావడంతో యజమానులు గోడున విలపిస్తూ తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.