22-08-2025 06:45:04 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ సర్వీసుల్లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చేస్తున్న పోరాటానికి ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ నుండి రావలసిన అన్ని రకాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారి ఆరోగ్య సంక్షేమానికి నిధులు కేటాయించాలని వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందినప్పటికీ వారికి ప్రభుత్వం పరంగా రావలసిన నిధులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయలేక పోతే ఆమ్ ఆద్మీ పార్టీ వారికి అండగా పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు