22-08-2025 06:42:26 PM
మహదేవపూర్,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో శుభానంద దేవి అమ్మవారికి శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా లక్ష పుష్పార్చన పూజ ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫనకంటి పనీంద్ర శర్మ, వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన సేవ సామూహిక లలిత సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు.