31-10-2025 01:02:24 AM
చేగుంట, అక్టోబర్ 30 :చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న కేజీబీవీ బాలికల హాస్టల్ విద్యార్థినుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను మండల వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆదేశాల మేర కు సిహెచ్‌ఓ అనిసోద్దిన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా సిహెచ్‌ఓ అనిసోద్దిన్ మాట్లాడుతూ హాస్టల్ ల్లో ఉన్న విద్యార్థులు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.