calender_icon.png 1 November, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ అభివృద్ధి పనులపై సమావేశం

31-10-2025 01:03:51 AM

కొల్చారం, అక్టోబర్ 30 :కొల్చారం గ్రా మ పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించా రు. పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 2026- 27 సంవత్సరంలో గ్రామంలో ఉపాధి హామీ పని ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఈ సమావేశంలో చర్చించారు. గ్రామంలో ప్రతి కూలికి పని కల్పించడమే ఉపాధి హామీ లక్ష్యమని, ఉపాధి హామీ పని ద్వారా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుధాకర్ గౌడ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.