calender_icon.png 25 July, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలి

24-07-2025 01:09:33 AM

మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ సందర్శన

మల్కాజిగిరి, జూలై 23(విజయక్రాంతి) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మను చౌదరి బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులను సమీక్షించి, ఆరోగ్య సేవలను ఎలాగా మెరుగుప ర్చొచ్చో అని అధికారులతో చర్చించారు. కలెక్టర్ తోపాటు అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్త, ఆర్డీఓ శ్యామ్, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, ఔషధ నిల్వలు, శానిటేషన్, రోగుల కోసం కల్పించిన సౌకర్యాలపై వారు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఆసుపత్రుల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది అని తెలిపారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ తగిన మార్గదర్శకాలను ఇచ్చారు. జిల్లా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.