calender_icon.png 18 October, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యసేవలు మెరుగ్గా ఉండాలి

18-10-2025 12:00:00 AM

  కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ, అక్టోబర్ 17 (విజయ క్రాంతి):ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వేలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( పీహెచ్ సీ), పీచర లోని ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మి కంగా తనిఖీ చేశారు.

ముందుగా వేలేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది తో మాట్లాడారు. వైద్యులు సిబ్బంది ఎంతమంది ఉన్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ గదిని తనిఖీ చేసి మందుల నిల్వలను పరిశీలించారు. మందులు సరిపోను నిల్వ ఉన్నాయా, ఎలా ఇండెంట్ చేస్తున్నారు, బీపీ, షుగర్, ఐరన్ పోలిక్ మాత్రలు ఇస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి ప్రతిరోజు ఎంతమంది వైద్య సేవల నిమిత్తం వస్తున్నారని, ఓపీతోపాటు  ప్రతిరోజు ఎన్ని టెస్టులు చేస్తున్నా రని కలెక్టర్ ఆరా తీశారు.

బిపి, షుగర్ నిర్ధారణ  పరీక్షలు ప్రతిరోజు ఎంతమందికి చేస్తుంటారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ, ఓపీ, అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది పనితీరు బాగుండాలని అన్నారు. ఫార్మసీలో సరిపోను మందుల నిల్వలను ఉంచాలన్నారు.  అదేవిధంగా  పీచరలోని సబ్ సెంటర్ ను తనిఖీ చేసి సిబ్బంది వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అక్కడ లేకపోవడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వేలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ మేఘన, స్థానిక తహసిల్దార్,ఇతర అధికారులు పాల్గొన్నారు.