calender_icon.png 5 October, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులకు వైద్య సిబ్బంది డుమ్మా

05-10-2025 12:05:00 AM

-కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వోకు సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలు

-మీర్జాపూర్ పీహెసీలో ఏడుగురు గైర్హాజరు

హుస్నాబాద్, అక్టోబరు 4: సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి శనివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేయగా తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. మెడికల్ ఆఫీసర్ సాయిదా కాజా మహనుమా భాను సెలవులో ఉండగా, ఒక్క నర్సు తప్ప మిగితా ఏడుగురు సిబ్బంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించడమే ప్రాథమిక కర్తవ్యం అయినప్పటికీ, ఇలా గైర్హాజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తక్షణం డీఎంఅండ్ హెచ్‌వోకు ఫోన్ చేసి ఆదేశించారు. డిప్యూటేషన్‌లు, ఇతర ఫీల్డ్ విధులు ఉంటే, సం బంధిత ఆర్డర్ కాపీ హాస్పిటల్‌లో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. పై అధికారి సెలవు మంజూరు లెటర్ రూపంలో చేశాకే సిబ్బంది సెలవు తీసుకోవాలని, అనుమతి లేనిదే విధులకు గైర్హాజరు కావద్దని హెచ్చరించారు. 

మీర్జాపూర్ పర్యటన అనంతరం కలెక్టర్ అక్కన్నపేట మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించారు. వైద్య కేంద్రాల తనిఖీల తర్వాత, కలెక్టర్ తన పర్యటనలో రెండు కీలక అంశాలపై దృష్టి సారించారు. ముందుగా హుస్నాబాద్ మండలం నేషనల్ హైవే రోడ్ వెంబడి జిల్లెలగడ్డలో గల స్టాటిక్ సర్వులైన్స్ టీమ్ (ఎస్‌ఎస్‌టీ) శిబిరాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు.