calender_icon.png 5 October, 2025 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లండన్‌లో తెలుగు యువకుడి మృతి

05-10-2025 12:06:58 AM

-గుండెపోటుతో మరణించిన వైనం

-మృతుడిది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట

కోరుట్ల, అక్టోబర్ 4 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపే టకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) గుండెపోటుతో మృతి చెందాడు. రెండు సంవత్సరాల క్రితం పైచదువుల కోసమని లండన్ వెళ్లి ఇటీవలే పీజీ పూర్తి చేసుకున్నాడు. రెండు నెలల క్రితం వర్క్ పర్మిట్ వీసా వచ్చింది. మహేందర్ తండ్రి రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మహేందర్ మృతి పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తోపాటు పలువురు మండల ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మహేందర్‌రెడ్డి భౌతికకాయాన్ని ఎంత సాధ్యమైతే అంత తొందరగా స్వగ్రామానికి చేర్చేలా ప్రయత్నాలు చేయాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.