calender_icon.png 4 July, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతృత్వాన్ని నిలిపిన మెడికవర్

04-07-2025 12:04:47 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి): అత్యున్నత వైద్య నైపుణ్యం కలిగిన మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హాస్పిటల్స్ మరోసారి తన వైద్య శ్రేష్ఠతను చాటుకుంది.. 35 ఏళ్ల నందిత అనే యువతి, తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతూ హిమోగ్లోబిన్ స్థాయి కేవలం 3.7 ఎంజీ/డీఎల్‌గా చేరగా అత్యవసర విభాగంలో చేరారు. పెద్ద గర్భాశయ ఫైబ్రాయిడ్ కారణంగా, పలు ప్రముఖ ఆసుపత్రులు ఆమెకు గర్భాశయం తొలగించమని చెప్పా యి.

కానీ మెడికవర్ వైద్య బృందం, ఆమె మాతృత్వాన్ని నిలపాలని నిర్ణయించుకుంది. మెడిక వర్‌కు రాకముందు, నందిత పరిస్థితి వేగంగా క్షీణించడంతో ఆమెకు ఇప్పటికే 16 యూనిట్ల రక్తం ఎక్కించారు. గర్భాశయ ఫైబ్రాయిడ్ పరిమాణం 10 సెంటీమీటర్లకు చేరింది. ప్రాణాంతక రక్త నష్టాన్ని నివారిం చడానికి హిస్టెరెక్టమీని సాధారణ చికిత్సగా భావిస్తారు.

అయినప్పటికీ, మెడికవర్ శస్త్రచికిత్సా బృందం, డాక్టర్ పృథ్వీ పెరుమ్ (కన్సల్టెంట్ రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జన్) నేతృత్వంలో, డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి (సర్జికల్ ఆంకాలజీ), డాక్టర్ శిల్ప (అనస్థీషియా) సహకారంతో, అత్యవసర మయోమెక్టమీ (ఫైబ్రాయిడ్‌ను తొలగిస్తూ గర్భాశయాన్ని సంరక్షించే ప్రక్రియ) చేయాలని నిర్ణయించుకుంది. శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావాన్ని తగ్గించేం దుకు, తాత్కాలిక గర్భాశ య ధమని అడ్డుకొనే అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.