calender_icon.png 2 August, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశీలో కూలిపోయిన ఇళ్లు .. శిథిలాల కింద ఎనిమిది మంది చిక్కుకున్నారు.

06-08-2024 12:40:04 PM

ఉత్తర ప్రదేశ్:    హిందువుల పవిత్ర  క్షేత్రం(వారణాసి) కాశీలో రెండు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఎనిమిది మంది చిక్కుకుపోయారు.కాశీ విశ్వనాథ్ ఆలయంలోని ఎల్లో జోన్ లో  ఇళ్లు కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. సిల్కో గల్లీ మీదుగా ఎంట్రన్స్ 4ఏ,కి వెళ్లే దారిలో ఉన్న ఇళ్లు సోమవారం అర్ధ రాత్రి 2 గంటల సమయంలో  నేల మట్టం అయ్యా యి. ఇళ్లు కూలి పోయాయని సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలలో భాగంగా ఆరోగ్య శాఖ, డాగ్ స్క్వాడ్, ఎన్డీ ఆర్ఎఫ్ గ్రూప్ లు పాల్గొన్నాయి. కాగా ఈ ఘటనకు కారణాలు తెలియరా లేదు.