07-08-2025 10:17:48 PM
బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ కుట్ర..
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు..
గరిడేపల్లి (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ బిల్లు ఒక దగాకోరు కాంగ్రెస్ పార్టీ కుట్ర అని, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై చేసే ఆరోపణలు మానుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు(BJP District Vice President Pokala Venkateswarlu) విమర్శించారు. గురువారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు పేరుతో న్యాయవంచనకు పాల్పడుతూ ముస్లింల రిజర్వేషన్ల కోసం డ్రామాలు షురూ చేసిందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు లేనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా బోగస్ సర్వే నిర్వహించి హిందువులైన బీసీల పేరుతో కాంగ్రెస్ కపటనీతిని బయట పెట్టుకుందన్నారు.
క్రిస్టియన్ గా మారిన వారిని బీసీలుగా చూపించకుండా కేవలం ముస్లింల ఓట్ల కోసం బరితెగింపు రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా కేంద్రం మీద నెపం పెట్టడం మానుకొని, నికార్సైన ముస్లిం ఇతర బీసీ బిల్లును పొందుపరిచి కేంద్ర ప్రభుత్వ గెజిట్ కోసం పంపాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఆగ్రహ జ్వాలలు కాంగ్రెస్ పార్టీ చవిచూడాల్సి వస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు మానుకొని సక్రమమైన పద్ధతిలో ముస్లిం ఇతర బీసీ బిల్లు కోసం కృషి చేయాలని ఆయన కోరారు.