07-08-2025 10:15:12 PM
కంగ్టి (విజయక్రాంతి): నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్(National Human Rights Social Justice Commission) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రహీమ్ ఆధ్వర్యంలో గురువారం కంగ్టి మండల అధ్యక్షులుగా శ్రీనివాస్ పవర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, మండలంతో పాటు ప్రతి గ్రామంలో మానవ హక్కుల పరిరక్షణ, విద్య, వైద్యం, బాలల హక్కుల పరిరక్షణ ఆరోగ్యం, న్యాయం, రెవెన్యూ, రైతు, మహిళల సమస్యలపై స్పందించి ఆ సమస్యల కొరకు కృసి చేయాలనీ అన్నారు. అనంతరం మండల అధ్యక్షులు మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను నావంతు బాధ్యతయుతంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ఛైర్మెన్ రాజ్ కుమార్, అఖిల్, ప్రధాన కార్యదర్శి మోహినొద్దీన్ ఖురేసి తదితరులు పాల్గొన్నారు.