07-08-2025 10:09:59 PM
బెజ్జంకి: మండలంలోని అన్ని గ్రామాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి నాయకులతో కలిసి తాహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తాహాశీల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందిని మండలంలోని పలు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మించాలని, కరీంనగర్ జిల్లాలో బెజ్జంకి మండలాన్ని కలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
తోటపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన దాచారం లద్దబండ గ్రామస్తులకు నేటికీ పరిహారం అందలేదని అని వారికి వెంటనే పరిహారం అందలా చూడని కోరారు, మండల కేంద్రము లో వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా కౌలు రైతులకు భరోసా మహాలక్ష్మి పథకలు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర మల్లేశం గౌడ్, బోయినిపల్లి అనిల్ రావు, దొమ్మటి రాములు,కొత్తపేట రామచెంద్రం,గైని రాజు,సంగ రవి,సాన వేణు, గాండ్ల శ్రీను,వడ్లూరు శ్రీనివాస్,ఒగ్గు కనకయ్య,వడ్లుర్ సాయిలు,బుర్ర కిషన్, బోనగిరి నరేష్, కంది రాజు,ఎలుక శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు