calender_icon.png 30 January, 2026 | 6:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

30-01-2026 02:20:19 AM

కండువా కప్పి ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పలువురు నాయకులు గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న సమక్షంలో కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మదన్ మోహన్ చారి ఆధ్వర్యంలో జరిగింది.

పార్టీలో చేరిన వారిలో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు మేకల నాగరాజు యాదవ్, కొల్లాపూర్ కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ నాయకుడు కోట్ల షేక్షావలి, ఎం.డి. రాషధ, ఎస్ ఇమ్రాన్ ఉన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేన్ అని నర్సింగ్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు శంక రొల్ల సురేష్ ముదిరాజ్, డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ వనం పద్మ సమక్షంలో బీజేపీ మాజీ కౌన్సిలర్ ఈగ సుధాకర్ ముదిరాజ్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జె శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరారు.