19-09-2025 12:54:40 AM
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ2: తాండవం’. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అఖండ’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు రావడం.. అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవ డమే ఇందుకు కారణం. అంతేకాకుండా, సంయుక్త మీనన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
హర్షాలి మల్హోత్రా ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అఖండ2’కు సంబంధించి అప్‌డేట్ కోసం అభిమా నులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గురించి ఓ తాజా కబురు నెట్టింట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ఓ పార్టీ సాంగ్‌ను షూట్ చేస్తున్నారనేదే తాజా ముచ్చట. చిత్ర సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పాటకు సంబంధించి షూటింగ్ తాజాగా గురువారమే మొదలైంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన ఓ సెట్‌లో ఈ గీతాన్ని తెరకెక్కిస్తు న్నారు. ఈ పాట చిత్రీకరణ పూర్తయితే, దాదాపు షూటింగ్ అంతా అయిపోయినట్టేనట. 14 రీల్స్‌ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్; ఫైట్స్: రామ్-లక్ష్మణ్; డీవోపీ: సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే; ఎడిటింగ్: తమ్మిరాజు; ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్.