19-09-2025 12:00:00 AM
మంచిర్యాల, సెప్టెంబర్ ౧8 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంచార కులాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురు వారం మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కండ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా సంచార జాతుల డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యమాలు నడుస్తున్నప్పటికిని ఈ రెండు ప్రభుత్వాలు ఏ ఒక్క డిమాండ్లను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగతిన డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ నాయకులు కర్రె లచ్చన్న, చెలిమెల అంజన్న, శాఖ పూరి భీమ్సేన్, అశోక్ వేముల, కీర్తి బిక్షపతి, నేన్నెల నరసయ్య, అంకం సతీష్, చంద్రగిరి చంద్రమౌళి, సురేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.