19-09-2025 12:55:48 AM
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దాన య్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమాఈ మూవీ ట్రైలర్ ఈ నెల 21న ట్రైలర్‌ను వదలనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
‘సత్య దాదా’గా ప్రకాశ్‌రాజ్
మరోవైపు ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం ద్వారా ప్రమోషన్స్‌ను కొనసాగి స్తోంది టీమ్. తాజా గా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులో ప్రకాశ్‌రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రకాశ్‌రాజ్ ఈ సినిమాలో ‘సత్య దాదా’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్; డీవోపీ: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస; కూర్పు: నవీన్ నూలి; నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి; దర్శకత్వం: సుజీత్.