19-09-2025 12:00:00 AM
బైంసా సెప్టెంబర్ 18: గోదావరి పరివక ప్రాంతమైన నాందేడ్ జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురవడంతో గోదావరిలో వరద నీటి ప్రభావం బుధవారం పెరిగింది. గోదావరిపై మహారాష్ట్రలో నిర్మించిన విష్ణుపురి గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో అది బాసర ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి చేరుకుంటుం ది.
బాసర వద్ద కొత్త బ్రిడ్జిని ఆనుకొని రెండు ఒడ్డులను కలుపుకొని గోదావరి ప్రవహించడంతో బాసర మండలంలోని సాలాపూర్ కౌటా ఓని బాసర పంచగూడ తదితర ప్రాం తాల్లో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌తో పంట లు మునిగిపోయినట్టు రైతులు తెలిపారు.
ముంపు నష్టం జరగకుండా చర్యలు
బాసర గోదావరి వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ మరోసారి పంట పొలాలను ముంపు గురి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 రోజుల క్రితమే మూడు రోజులపాటు పంట నీటిలో మునగడంతో తీవ్ర నష్టం జరగగా మళ్లీ వరద నీరు పంటలను ముంచి వేయడంతో ఈ విషయాన్ని ముధోల్ ఎమ్మెల్యేకు రైతులు మొరపెట్టుకున్నారు.
ఆయన జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమస్య చెప్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదలను పెంచాలని సూచించగా ఆయన అధికారితో మాట్లాడి నీటి విడుదలను పెంచారు ప్రస్తుతం శ్రీరాంసాగర్లోకి 2 లక్షల పై వరద నీరు వస్తుండగా మూడు లక్షల క్యూసెక్కులను 36 గేట్ల ద్వారా విడుదల చేసినందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది