calender_icon.png 13 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలి

13-09-2025 12:51:09 AM

స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ క్రిస్టినా

నారాయణపేట.సెప్టెంబరు 12(విజయక్రాంతి) : మద్దూరు సామాజిక ఆరోగ్య కేం ద్రంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ క్రిస్టి నా చొంగ్తూ ఆదేశించారు. శుక్రవారం సా యంత్రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి ఆమె మద్దూరు సామాజిక ఆరోగ్య కేం ద్రాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని వా ర్డులను తిరిగి రోగులతో మాట్లాడారు. వైద్య సేవల గురించి రోగులతో వాకబు చేశారు.

అనంతరం ఆస్పత్రిలో కలెక్టర్, స్టేట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ము ఖ్య అధికారులతో ఆస్పత్రి అభివృద్ధి, ప్రగ తి,అవసరమైన వసతి సదుపాయాల గురిం చి సమీక్ష నిర్వహించారు. బిల్డింగ్, , డ్రగ్స్ పె సిలిటీ, ఎన్ సీ డి స్క్రీనింగ్, టీబీ టెస్ట్, తదితర వాటి గురించి చర్చించారు. ఆస్పత్రికి వె యిటింగ్ కుర్చీలు, బెడ్స్, అవసరమని ఆర్ ఎం వో పావని కోరారు. ఇంకా ఏమైనా అవసరమా ఉంటే ప్రతిపాదనలు పంపించాలని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ క్రిస్టినాసూచించారు.