calender_icon.png 13 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

13-09-2025 12:51:36 AM

-అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం

-కుషాయిగూడలో ఘటన

కాప్రా, సెప్టెంబర్12(విజయక్రాంతి)ః కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్పేట్ హెచ్‌బీ కాలనీ మంగాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మొగుళ్ల శ్రీకాంత్‌రెడ్డి(42) దారుణ హత్యకు గురయ్యాడు. తన వద్ద నమ్మకంగా పనిచేసే అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ సంఘటనతో  ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల సహకారంతో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. కుషాయిగూడ సీఐ ఎల్. భాస్కర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించింది.