calender_icon.png 16 August, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటి అద్దాలను పంపిణీ చేసిన దుద్దిల్ల శీను బాబు

15-08-2025 11:20:58 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఉచిత కంటి అద్దాలను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సౌజన్యంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి హైదరాబాద్ ఆధ్వర్యంలో కాటారం డివిజన్ లోని 5 మండలాలలోని ప్రజలకు ఇటీవల మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కంటి ఆపరేషన్ అవసరం అయిన వారికి హైదరాబాద్ తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేయించి పంపించారు. అనంతరం ఈరోజు ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు చేరువ చేయడం కొరకు ముఖ్యంగా కంటి వెలుగు కోల్పోయే పరిస్థితిని నివారించడం కోసం ఇలాంటి వైద్య శిబిరాలు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం ఎంతో అవసరం అని గ్రహించి కంటి శాస్త్ర చికిత్స కోరకు కంటి సంరక్షణ అవసరాన్ని గుర్తించి పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ సేవల నిర్వహించడం జరిగిందని తెలిపారు.