16-08-2025 12:00:00 AM
స్టార్ హాస్పిటల్స్‌లో స్వాతంత్య్ర వేడుకలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): 79వ స్వాతంత్య్ర దినోత్స వాన్ని స్టార్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా జరుపుకుంది. పేషెంట్లు, వారి అటెండర్లు, సిబ్బం దికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ త్రివర్ణ పతాకం రంగుల స్ఫూర్తితో రూపొందించిన భోజనాన్ని ఆసుపత్రి కాంటీన్‌లో శుక్రవారం వడ్డించారు. స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ డాక్టర్ రాహుల్ మెడక్కర్ మాట్లాడుతూ..
“స్వాతంత్య్ర దినోత్సవం అనేది కృతజ్ఞత, ఐక్యత, ఆత్మప రిశీలనకు సమయంగా ఉంటుంది. స్టార్ హాస్పిటల్స్‌లో, మేము శారీరక ఆరోగ్యంతో పాటు భావోద్వేగ శ్రేయస్సును కూడా సమానంగా కాపాడాలని విశ్వసిస్తున్నాం. త్రివర్ణ పతాకం రంగుల ప్రతీకతో, పోషక విలువలతో కూడిన ఈ ప్రత్యేక భోజనం ద్వారా, మా పేషెంట్లు, సిబ్బందితో ఆనందం, గర్వాన్ని పంచుకున్నాం” అని చెప్పారు.