16-08-2025 12:00:00 AM
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం కన్నుల పండువగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతకాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎగురవేశారు. ఈ వేడుకల్లో భాగంగా నగరంలోని 2,597 స్వయం సహాయక సంఘాలకు 288 కోట్ల 85 లక్షల రూపాయలు, స్వయం ఉపాధి కింద 155 మంది ట్రాన్స్‌జెండర్‌లకు 55 లక్షల రూపాయలు పంపిణీ చేశారు.
జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో గ్రాఫిక్ డిజైన్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు ట్రాన్స్ జెండర్‌లకు రెడ్ టివి జాబ్ ఆఫర్ పత్రాలను మేయ ర్ అందజేశారు. జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలోనీ డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో గ్రేటర్ హైదరాబాద్‌ను అత్యుత్తమ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.