calender_icon.png 19 October, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26న బెల్లంపల్లిలో మెగా జాబ్ మేళా

18-10-2025 07:40:31 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో ఈనెల 26న మెగా జాబ్ మేళా - 2025  ఏర్పాటు చేశారు. జాబ్ మేళా ఏర్పాట్లను మందమర్రి జీఎం ఎన్ రాధాకృష్ణ, పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే  గడ్డం వినోద్, సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాల మేరకు  బెల్లంపల్లిలోని ఏఎంసీ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ, నోబల్ ఎంపవరమెంట్  సంయుక్తంగా మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఉదయం 7 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందన్నారు.ఈ జాబ్ మేళాకు, మందమర్రి, బెల్లంపల్లి, పరిసర ప్రాంతాలలోని సుమారు 7000 మంది నిరుద్యోగ యువత రానున్నట్టు తెలిపారు. ఈ జాబ్ మేళాకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు జిఎం రాధాకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.