calender_icon.png 19 October, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలికుంటు వ్యాధిపై అవగాహన

18-10-2025 07:41:19 PM

పశు వైద్యాధికారి తిరుపతి

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పాడి రైతులకు గాలికుంటు వ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పించారు. శనివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ ముందస్తు టీకాలు వేయడం ద్వారా పశువులు గాలికుంటు వ్యాధి బారిన పడకుండా కాపాడు కోవచ్చన్నారు. ఈ టీకాలు 6 నెలలు నిండిన దూడ నుండి అన్ని ఆవులకు, గేదెలకు వేయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని మండలంలోని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వెటర్నరీ అధికారి ఈ కృష్ణవేణి, గోపాల మిత్రలు ఎం రమేష్, రాయమల్లు, అనూప్, మధుకర్ లు పాల్గొన్నారు.